...
...
Next Story

ద్రోణి ప్రభావం...! ఏపీ, తెలంగాణలో ఈ 2 రోజులు భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలు

ఏపీలో ఈ 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Published on: Jun 11, 2025, 05:00:13 IST
By , , Andhrapradesh, Telangana
Prefer HTon Google
Advertisement

ద్రోణి ప్రభావంతో ఏపీలో ఈ 2 రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 40-60 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచింది. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని హెచ్చరించింది.

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన…!

ఏపీకి భారీ వర్ష సూచన (@APSDMA)
ఏపీకి భారీ వర్ష సూచన (@APSDMA)

ప్రకాశం,నెల్లూరు,నంద్యాల,కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి- మోస్తారు వర్షాలుకురిసే అకాశం ఉందని అంచనా వేసింది.

ఇవాళ(జూన్ 11) విజయనగరం, పార్వతీపురంమన్యం, పశ్చిమగోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40- 41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలోనూ భారీ వర్షాలు…

ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలుకురిసే అవకాశం ఉంది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక మరికొన్ని చోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

రేపు(జూన్ 12) వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe