...
...
Next Story

నంద్యాల జిల్లాలో దారుణం - ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన తండ్రి..! ఆపై సూసైడ్

నంద్యాల జిల్లాలో ఉయ్యాలవాడ మండలంలో దారుణం వెలుగు చూసింది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేశాడు. ఆపై అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Jan 01, 2026 03:03 PM IST
Advertisement

ఓ తండ్రి తన ముగ్గురు మైనర్ కుమారులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలో వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

నంద్యాల జిల్లాలో దారుణం (Photo for representation)
నంద్యాల జిల్లాలో దారుణం (Photo for representation)

స్థానిక పోలీసుల వివరాల ప్రకారం…. తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (35) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన ముగ్గురు పిల్లలైన కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి(4), సూర్యగగన్‌(2)లకు విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించాడు. దీంతో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆపై తండ్రి సురేంద్ర కూడా ఉరి వేసుకొని చనిపోయాడు.

గతేడాది ఆగస్టులో సురేంద్ర భార్య… మహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత నుంచి సురేంద్ర మానసికంగా ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడా అనేది తేలాల్సి ఉంది.

ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు బయటికొస్తాయని పేర్కొన్నారు.

సురేంద్ర కుటుంబం ఆర్థికంగా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. దీనికితోడు భార్య ఆగస్టులో ఉరి వేసుకొని చనిపోవటంతో…. మరింత మానసిక కుంగుబాటుకు సురేంద్ర లోనైట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe