రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. స్పాట్‌లోనే బియ్యం పరీక్షించేందుకు అందుబాటులోకి మెుబైల్ కిట్స్ తీసుకొచ్చామన్నారు. 700 మెుబైల్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. బియ్యం కిట్ పరీక్షలో బియ్యం ఎరుపు రంగులోకి మారితే అవి రేషన్ బియ్యంగా నిర్ధారించవచ్చని వెల్లడించారు.

'గతంలో పట్టుకున్న బియ్యాన్ని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించాల్సి వచ్చేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన మెుబైల్ కిట్స్‌తో బియ్యాన్ని వెంటనే పరీక్షించవచ్చు. వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో మార్పులు తీసుకువచ్చాం. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. విశాఖలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. చెక్ పోస్టుల్లో 33 మంది సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో 24 గంటలు పని చేస్తారు.' అని మంత్రి నాదెండ్ల అన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్రమంగా తరలిస్తున్న 5.65 లక్షల క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. అక్రమార్కులపై 230 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలకు మంచి బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం ఉపయోగంలో రాష్ట్రంలో మార్పు మెుదలైందన్నారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతీ సరకును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా చర్యలు తీసుకున్నామని, నగరంలో 33 మంది సిబ్బందితో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వేరే రాష్ట్రా నుంచి తరలివస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామన్నారు. నిఘా విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
{{/usCountry}}విశాఖపట్నం నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా చర్యలు తీసుకున్నామని, నగరంలో 33 మంది సిబ్బందితో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వేరే రాష్ట్రా నుంచి తరలివస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామన్నారు. నిఘా విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
{{/usCountry}}'చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందిస్తాం. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు, క్యూఆర్ కోడ్ జారీ చేశాం. దుకాణాలకు ఎంత బియ్యం పంపించాం. పంపిణీ ఎంత అవుతుందని వివరాలను సేకరిస్తున్నాం.' అని మంత్రి నాదెండ్ల అన్నారు.