ఏపీలో మెుంథా తుపాను తీవ్రంగా ప్రభావం చూపించింది. భారీగా పంట నష్టం జరిగింది. పంట నష్టం వివరాలు అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఈ పంట నష్టం గడువును మరో రెండు రోజులు పొడిగించినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సమీక్ష మండలి సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయనతోపాటుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందిస్తామని అన్నారు. కొంతమంది రైతుల పంట నష్టం వివరాలు నమోదు కాలేదని తెలిసిందని అందుకే పొడిగిస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో ఈ క్రాప్ నమోదు వందశాతం జరిగిందన్నారు. ఈ క్రాప్ నమోదు చేయలేదని జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎక్కడకు వచ్చినా... తాను వస్తానని, ఈ క్రాప్ నమోదు అయిందో లేదో చూపిస్తానని చెప్పారు.
మెుంథా తుపాను భారీగా పంట నష్టం చేసింది. రైతులకు నట్టేట ముంచి వెళ్లింది. సుమారు 1.98 లక్షల మంది రైతులకు చెందిన 3.75 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు సైతం పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేయాలన్నా.. లేక పునరుద్ధరించాలన్నా.. 2 వేల 500 కోట్లపైన అవుతుందని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చెప్పింది.
ఇక తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టంలో సుమారు 70 శాతం వరకు వరి పంట ఉంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంట నెలకొరిగి నీటిలో నానడం వల్ల వరికంకులన్నీ కుళ్లిపోయాయి. వేలాది ఎకరాల్లో మెుక్కజొన్న, మినుము, పత్తి, కూరగాయలు, ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేతికి వచ్చే దశలో వరిపంటను తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. కాకినాడ జిల్లాలో 14 మండలాల్లోని 216 గ్రామాల్లో, కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల పంట భారీగా దెబ్బ తింది. కాకినాడ జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా, కోనసీమ జిల్లాలో 78 వేల ఎకార్లో నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ఇంకా పూర్తి కాకపోవడంతో మరో రెండు రోజులు గడువు పెంచుతున్నట్టుగా తాజాగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
{{/usCountry}}ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేతికి వచ్చే దశలో వరిపంటను తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. కాకినాడ జిల్లాలో 14 మండలాల్లోని 216 గ్రామాల్లో, కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల పంట భారీగా దెబ్బ తింది. కాకినాడ జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా, కోనసీమ జిల్లాలో 78 వేల ఎకార్లో నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ఇంకా పూర్తి కాకపోవడంతో మరో రెండు రోజులు గడువు పెంచుతున్నట్టుగా తాజాగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
{{/usCountry}}