...
...
Next Story

శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్.. ఈ కేంద్రాల్లో బుక్ చేసుకోవాలి!

శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్. శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంది. అయితే ఇది పరిమిత సంఖ్యలోనే ఉంటుంది.

Published on: Nov 9, 2025, 15:41:38 IST
Advertisement

పరిమిత సంఖ్యలో శబరిమల అయ్యప్ప దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్య ఉంది. దేవస్థానం బోర్డు గుర్తించిన కేంద్రాల్లో మాత్రమే ఈ బుకింగ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. గుర్తింపు కార్డును చూపించి ఈ స్పాట్ బుకింగ్ చేసుకోవవచ్చు. అయితే ఆన్‌లైన్ వర్చువల్ క్యూ స్లాట్లు ఫుల్ అయిన తర్వాత రోజుకు గరిష్టంగా 20,000 మంది భక్తులు స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనానికి నమోదు చేసుకోవచ్చు. భక్తులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్) తీసుకురావాలి.

శబరిమల
శబరిమల

స్పాట్ బుకింగ్ కేంద్రాలు చూసుకుంటే.. ఎరుమేలి : అయ్యప్ప భక్తుల యాత్రలో ప్రాముఖ్యమున్న పవిత్ర స్థలం. వండిపెరియార్ : పుల్మేడు నిర్దిష్ట మార్గం ద్వారా దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటు చేశారు. నీలక్కల్ : యాత్రికుల ప్రధాన విశ్రాంతి స్థలం, దర్శనానికి ప్రవేశించే మొదటి దశ. పంబ : ఆలయానికి ఎక్కే మెట్లు ప్రారంభమయ్యే ముందు ఉన్న చివరి యాత్రా కేంద్రం. ఈ నాలుగు కేంద్రాల్లో స్పాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ స్లాట్స్ రోజూవారీ కోటా పూర్తయిన తర్వాత మాత్రమే స్పాట్ బుకింగ్ మెుదలవుతుందని గుర్తుంచుకోవాలి. 20,000 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. 70 వేల మందికిపైగా భక్తులు వర్చువల్ క్యూ వెబ్‌సైట్ ద్వారా స్లాట్స్ ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేనివారు.. పైన చెప్పిన రియల్ టైమ్ బుకింగ్ కేంద్రాల్లో చేయవచ్చు.

పూజలు, వర్చువల్ క్యూ, వసతి కోసం భక్తులు www.onlinetdb.com వెబ్‌సైట్ సందర్శించాలి. ఆన్‌లైన్ సేవల కోసం భక్తులకు మెుబైల్ నెంబర్, ఇమెయిల్ చిరునామా కావాలి. ముందుగా రిజిస్టర్ చేసుకుని.. పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాతే గదులు బుక్ చేయాలి. ఇక శబరిమలలో వసతి సౌకర్యం రూ.80 నుంచి ప్రారంభమై.. గదిని బట్టి రూ.2200 వరకు ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe