...
...
Next Story

ఇక వీటి ఆస్తిహక్కు మీ చేతికి.. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు!

ఏపీ ప్రభుత్వం గ్రామాల్లో ఆస్తి హక్కు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. స్వామిత్వ పథకంలో భాగంగా 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులను జారీ చేస్తున్నారు.

Published on: Nov 10, 2025, 10:14:30 IST
Advertisement

స్వామిత్వ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్రత్యేక గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ కంఠాల్లో ఆస్తులకు యాజమాన్య హక్కులను కల్పించనున్నారు. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను సరిగా చేసి.. వాటిపై హక్కులను సంబంధిత వ్యక్తులకు కల్పిస్తున్నారు. స్వామిత్వ పథకం రెండో విడతలో భాగంగా 45 లక్షల ప్రాపర్టీ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లోని ఆస్తులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు ఇవ్వడం. ప్రాపర్టీ కార్డులు గ్రామాల్లోని ఇళ్లు, స్థలాలకు సంబంధించిన అధికారిక పత్రాలుగా ఉంటాయి. వీటితో ఆస్తి ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. వివాదాలు కూడా తగ్గుతాయి. ఆస్తి హక్కు కోసం చూస్తున్న గ్రామీణులకు దీనితో మేలు జరుగుతుంది. ఆబడి, అనాధీన, ఆక్రమణలకు సంబంధించి ప్రభుత్వ లెక్కల్లో లేని ఆస్తులను గుర్తించి.. సంబంధిత హక్కుదారలు పట్టాలు అందిస్తారు.

ప్రభుత్వం నాలుగు నెలల్లో 5 వేలకుపైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేసి ప్రాపర్టీ కార్డులను ఇవ్వడానికి సిద్ధమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో పనులు వేగవంతం అయ్యాయి. 2026 మార్చిలోపు ఏపీలోని ప్రతీ గ్రామంలోనూ హక్కుదారలకు కార్డులను అందజేస్తారు. ఇవాళ్టి నుంచి 2344 గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి.. ఆస్తుల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారు.

గ్రామస్థుల దగ్గర ఉన్న ఆధారాల ఆధారంగా ఆస్తుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యంతరాలు ఉంటే నమోదు చేసి వారంలోగా పరిష్కారం చేస్తారు. ఒకవేళ పరిష్కారం కాకపోతే.. ఫారమ్-19 ద్వారా అప్పీల్ చేసుకుని.. రీసర్వే కోసం డిప్యూటీ తహసీల్దార్ వద్దకు పంపిస్తారు. ఏదైనా కుటుంబానికి డాక్యుమెంట్స్ లేకున్నా.. వారి ఆస్తి గ్రామ కంఠంలో 12 ఏళ్లపాటు ఆధీనంలో ఉన్నా.. వారికి యాజమాన్య పత్రాలు ఇస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe