ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. జూలై 7వ తేదీ అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.జూలై 18వ తేదీ వరకు గడువు ఉంటుంది. https://www.sthreenidhi.ap.gov.in వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ స్త్రీ నిధిలో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు
- ఉద్యోగ నోటిఫికేషన్ - స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్, ఏపీ ప్రభుత్వం.
- మొత్తం ఖాళీలు - 170
- ఉద్యోగాలు - అసిస్టెంట్ మేనేజర్ కేడర్
- కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు.
- అర్హతలు - ఏదైనా డిగ్రీ
- 01.06.2025 నాటికి 42 ఏళ్లు దాటకూడదు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - 7 జూలై 2025
- దరఖాస్తులకు చివరి తేదీ - 18 జూలై 2025
- దరఖాస్తు ఫీజు - రూ. 1000
- నెలకు జీతం - రూ. 25, 520తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… షార్ట్ లిస్ట్ (1:4 నిష్పత్తిలో) ఇస్తారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- మొత్తం 100 మార్కులకు ప్రతిపాదికన మెరిట్ లిస్టులను తయారు చేస్తారు. పదో తరగతి మార్కుల నుంచి పని చేసిన అనుభవం వరకు మార్కులను కేటాయిస్తారు. ఈ వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.sthreenidhi.ap.gov.in
{{^htLoading}} {{/htLoading}}
ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూడొచ్చు
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}