గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు బెంబేలెత్తించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిలో చికెన్ ధర రూ.380 నుంచి రూ.400 వరకు పలికింది. దీంతో చికెన్ కొనాలంటేనే…వణికిపోయారు. చికెన్ బదులు మటన్ కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే మళ్లీ చికెన్ షాపులు సందడిగా మారిపోయాయి. కారణం ఒక్కసారిగా ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో చికెన్ ప్రియులు…. క్యూలు కడుతున్నారు.

కేజీ చికెన్ రూ. 380 వరకు పలకగా… తాజాగా వంద రూపాయలకు పైగా ధర తగింది. దీంతో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర (స్కిన్ లెస్) రూ.265 నుంచి 270 పలుకుతుంది. అటు జిల్లాల్లోనూ చికెన్ ధరలు భారీగా దిగివచ్చాయి. స్కిన్ తో అయితే చికెన్ రూ.235 నుంచి రూ.240 వరకు పలుకుతుంది.
ఇక ఏపీలో చూస్తే కిలో చికెన్ రూ.300 నుంచి 350 మధ్య పలుకుతోంది. ఒక్కసారిగా చికెన్ ధరలు తగ్గిపోవటంతో…. మాంసం ప్రియులు మళ్లీ షాపులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా చికెన్ ధరల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో చికెన్ ధరలు తగ్గాయని చెబుతున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వేసవి కావటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కాలంలో కోళ్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటి కారణాలతో మార్కెట్‌లో చికెన్ ధరలు ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
సాధారణంగా కిలో చికెన్ ధర రూ.170 నుంచి రూ.220 మధ్య ఉంటుంది. శ్రావణ, కార్తీక మాసాలలో ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ గత రెండు నెలల్లో ఏకంగా కిలో రూ.400 ఆల్ టైం రికార్డు ధర పలికింది. ప్రస్తుతం చికెన్ ధరలు భారీగా దిగిరావడంతో మాంసం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.