...
...
Next Story

చలికి వణికిపోతున్న తెలంగాణ పల్లెలు - అత్యల్పంగా మెయినాబాద్ లో 6.6 డిగ్రీలు…!

రాష్ట్రంలో చలి తీవత్ర రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈమేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది.

Published on: Dec 10, 2025 09:58 AM IST
Advertisement

రాష్ట్రంలో చలి తీవత్రకు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణలో చలి తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత

ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు(డిసెంబర్ 11)వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు…

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ ఉదయం మెయినాబాద్ లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా… శేరిలింగంపల్లిలో 8.4°C, రాజేంద్ర నగర్ లో 9.2, మౌలిలో 9.4, బెల్ వద్ద 10.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  • గచ్చిబౌలి - 11.4
  • కుత్బుల్లాపూర్ - 11.9
  • వెస్ట్ మారేడుపల్లి -12.4
  • హయత్ నగర్ - 12.7
  • కిషన్ బాగ్ - 12.8
  • ముషీరాబాద్ -12.9
  • హిమాయత్ నగర్ - 12.9
  • చార్మినార్ - 12.9
  • బేగంపేట్ - 13.5
  • నేరెేడ్ మెట్ - 13.5
  • గొల్కోండ - 13.7
  • తిరుమలగిరి - 14 డిగ్రీలు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe