...
...
Next Story

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు : పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం - ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఇలా

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. మొత్తం 101 పోస్టల్ ఓట్లు లెక్కించగా… కాంగ్రెస్ కు స్వల్ప అధిక్యం లభించింది.

Published on: Nov 14, 2025 08:49 AM IST
Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే ఈ ప్రక్రియ మొదలు కాగా… ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఈ ఎన్నికలో మొత్తం 101 పోస్టల్ ఓట్లు పోలవగా… ఇందులో కాంగ్రెస్ కు 39 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ కు 36, బీజేపీకి 10 ఓట్లు పోలయ్యాయి. దీని బట్టి పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ అతి స్వల్ప ఆధిక్యం లభించింది.

మొదటి రౌండ్ ఓట్ల వివరాలు…

జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్

మరోవైపు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా షేక్ పేట డివిజన్ ఓట్లను లెక్కించారు. ఇందులో కూడా కాంగ్రెస్ కు 62 ఓట్ల లీడ్ దక్కింది. కాంగ్రెస్ కు 8926, బీఆర్ఎస్ - 8864 ఓట్లు దక్కాయి.

ఈ ఉప ఎన్నికలో మొత్తం పోలైన ఓట్లు 1,94,631గా ఉండగా.. వీటిలో పురుషుల ఓట్లు 99,771గా ఉన్నాయి. ఇక మహిళలు - 94,855, ఇతరుల ఓట్లు 5గా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 48.49 శాతంగా నమోదైంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe