...
...
Next Story

TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై కొత్త అప్డేట్ - ఈ తేదీల్లో రావొచ్చు..!

Telangana 10th Class Results 2026: తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్. ఇవాళ్టితో మూల్యాంకనం పూర్తవుతుంది. ఆపై మార్కుల క్రోడీకరణ ఉంటుంది. మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

Published on: Apr 25, 2026 03:09 PM IST
Advertisement

పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే సాధ్యమైనంత త్వరగానే ఈసారి ఫలితాలను ప్రకటించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం కాగా…. నేటితో పూర్తి కానుంది. అన్ని సబ్జెక్టుల పేపర్ల దిద్దే ప్రాసెస్ పూర్తి కావటంతో… ఫలితాల క్రోడీకరణపై ఫోకస్ చేస్తున్నారు.

తెలంగాణ టెన్త్ ఫలితాలపై కొత్త అప్డేట్
తెలంగాణ టెన్త్ ఫలితాలపై కొత్త అప్డేట్

నేటితో స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కానుండగా…. మరో వారం రోజుల పాటు క్రోడీకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే స్కానింగ్ ప్రక్రియ కంప్లీట్ చేస్తారు. మార్కుల క్రోడీకరణ (ట్యాబ్యులేషన్)లో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పరిశీలిస్తారు.

మే ఫస్ట్ వీక్ లోనే ఫలితాలు…!

అన్ని కుదిరితే ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. మొదటి వారంలోనూ మే 4 లేదా 5వ తేదీలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ…. మొత్తంగా మే మొదటి వారంలోనే ఫలితాలను ప్రకటించే ఛాన్స్ ఉంది.

తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఎస్సెస్సీ బోర్డు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది.

పరీక్ష రాసిన విద్యార్థులు…. 80969 58096 నంబర్‌కు ‘హాయ్‌’ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదుచేయాలి. ఆ తర్వాత ఫలితం స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe