...
...
Next Story

ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీ కొట్టిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులు వెళ్తున్న కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు.

Published on: Jan 08, 2026 06:55 AM IST
Advertisement

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోకిల పరిధిలో మీర్జాగూడ వద్ద కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు ఐసీఎఫ్ఏఐ వర్సిటీకి చెందినవారు, మరొకరు ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు. మృతుల పేర్లు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్. హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన జరిగింది. ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉండే పండ్ల వ్యాపారి విస్లావత్ రాములుకు అతడి భార్యతో పది సంవత్సరాలుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. చాలాసార్లు పెద్దల ముందు పంచాయితీ జరిగింది. అయినా మార్పు లేదు. తాజాగా కూడా గొడవలు జరిగాయి. దీంతో భార్య సూర్తి, పిల్లలు సవిత, పాండు కలిసి రాములుపై దాడి చేశారు.

అందుబాటులో ఉన్న కర్రలు, రాడ్‌తో కొట్టారు. రాములుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సవిత ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది, పాండు ఇంటర్ చదువుతున్నాడు. మరో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రాములు చంపిన తర్వాత నిందితులే బంధువులకు ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని చెప్పారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe