సికింద్రాబాద్, ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా టర్మ్ బేసిస్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇందుకు ఫిబ్రవరి 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఆర్మీ స్కూల్ లో ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలు
- ఉద్యోగ ప్రకటన - ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం, సికింద్రాబాద్
- ఉద్యోగ ఖాళీలు - టీచింగ్ పోస్టులు
- 4 అకాడమిక్ సంవత్సరాల పాటు టర్మ్ బేసిస్ ప్రాతిపదికన కింది విభాగాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులున్నాయి.
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో అత్యధికంగా ప్రైమరీ టీచర్ ఖాళీలు 20 ఉన్నాయి.టీజీటీ ఖాళీలు 18, ప్రీ-ప్రైమరీ టీచర్ 6 ఖాళీలున్నాయి.
- పోస్టును బట్టి విద్యా అర్హతలుంటాయి. టీచింగ్ పోస్టులకు బీఈడీతో పాటు టెట్ లేదా సీటెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్, హిందీ భాషల్లో బోధనా నైపుణ్యాలు ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- “ARMY PUBLIC SCHOOL RK PURAM” పేరు మీద రూ. 250 డీడీ చెల్లించాలి.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను “ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్‌కే పురం, సికింద్రాబాద్ - 500056” చిరునామాకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ - 3 ఫిబ్రవరి 2026
- దరఖాస్తుల షార్ట్ లిస్ట్ తర్వాత ఫిబ్రవరి నెలలోనే ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://apsrkpuram.edu.in/

{{^htLoading}} {{/htLoading}}
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}