...
...
Next Story

విద్యార్థి కర్ణభేరి దెబ్బతినేలా కొట్టిన ఉపాధ్యాయుడు.. వినికిడి శక్తి కోల్పోయిన బాలుడు!

మహబూబ్‌న‌గర్ జిల్లా జడ్చర్లలో ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. విద్యార్థి కర్ణభేరి దెబ్బతినేలా కొట్టాడు.

Published on: Nov 10, 2025 06:10 PM IST
Advertisement

కొంతమంది ఉపాధ్యాయులు ప్రవర్తించే తీరుతో పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. తాజాగా మహబూబ్‌న‌గర్ జిల్లా జడ్చర్లలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు.. విద్యార్థిని దారుణంగా కొట్టాడు. విచక్షణ కోల్పోయి కొట్టడంతో విద్యార్థి కర్ణభేరి దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాధిత విద్యార్థి
బాధిత విద్యార్థి

జడ్చర్లలో స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో ఉంటూ సిద్ధార్థ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అల్లరి చేస్తున్నాడని ఉపాధ్యాయుడు నాగరాజు విచక్షణ కోల్పోయి విద్యార్థిని కొట్టాడు. ఎడమ చెవిపై కొట్టడంతో సిద్ధార్థ చెవికి బాగా దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పాడు.

తల్లిదండ్రులు వచ్చి విద్యార్థిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన అనంతరం విద్యార్థికి చెవి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు గమనించి కర్ణభేరి బాగా దెబ్బతిని ప్రస్తుతానికి వినికిడి కోల్పోయిందని తెలిపారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహించి.. పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ కుమారుడిని కొట్టడంతో వినికిడి కోల్పోయాడాని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అయితే పాఠశాల ప్రిన్సిపల్ వచ్చి.. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని చెప్పారు. కానీ అతడిని పాఠశాలలోనే ఓ గదిలో దాచి పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేశాయి. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆందోళన విరమింప చేసే ప్రయత్నం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe