...
...
Next Story

అడిగిన సమాచారం ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.

Published on: Oct 14, 2025 03:35 PM IST
Advertisement

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసును జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం విచారణ చేసింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్‌ను అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. డిజిటల్ డివైసెస్‌లో డేటా ఫార్మా చేశారన్నారు. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ ఇవ్వడం లేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారిపోగానే.. హార్డ్ డిస్క్‌లలో డేటా ధ్వంసం చేసినట్టుగా న్యాయవాదులు వెల్లడించారు.

'కొత్తగా 50 హార్డ్ డిస్క్‌లు అక్కడ పెట్టారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్‌లను టాప్ చేశారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలను చేశారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారు.'అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. 'ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనను 11సార్లు పిలిపించి 80 గంటల పాటు విచారణ చేశారు. డేటాను ప్రభాకర్ డిలీట్ చేయలేదు. డిపార్ట్‌మెంట్ డిలీట్ చేసింది.' అని వాదనలు వినిపించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe