...
...
Next Story

ఉద్యోగులకు 2 డీఏలు…! తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణమే ఒక డీఏను ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

Published on: Jun 05, 2025 10:40 PM IST
By , , Telangana
Prefer HTon Google
Advertisement

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కప్రకటన చేశారు. తక్షణమే ఒక DAను ఇస్తున్నట్లు తెలిపారు. రెండో డీఏను మరో 6 నెలల్లో ఇస్తామని వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలివే…

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

మెట్రో రెండో విడత విస్తరణపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ జరిగింది. ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించింది. లోన్‌ బీమా చెల్లింపుల కోసం రూ.70 కోట్లు చెల్లిస్తూ ఆమోదముద్ర వేసింది. హమ్‌ విధానంలో గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టాలని కేబినెట్నిర్ణయించింది.

  • ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు. బీమాకు ఉద్యోగులు ప్రతినెలా రూ.500చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత్త చెల్లిస్తుంది.
  • ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండింగ్‌ బకాయిలను నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లించేందుకు నిర్ణయం.
  • పెండింగ్‌ బకాయిలను నెలల వారీగా క్లియర్‌ చేసేలా కేబినెట్ నిర్ణయం.
  • మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే రూ.10లక్షలు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం.
  • ఆర్‌అండ్‌బీ పరిధిలో 5,100 కి.మీ, పంచాయతీరాజ్‌ పరిధిలో 7,947 కి.మీ రహదారులు ఆధునీకరణకు నిర్ణయం.
  • కొత్తగూడెంలోని ఎర్త్‌ సైన్స్‌ యూనివర్శిటీకి మన్మోహన్‌సింగ్‌ పేరు పెట్టేందుకు మంత్రివర్గం నిర్ణయం.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe