...
...
Next Story

డిసెంబర్‌ 1 నుంచి ప్రజా పాలన విజయోత్సవాలు - బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం..!

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రులు చర్చించారు.

Published on: Oct 16, 2025, 19:23:18 IST
Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినందున విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనున్నారు.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇక రాష్ట్రంలో కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయశంకర్‌ వర్సిటీకి అనుబంధంగా ఈ కాలేజీలు ఏర్పాటవుతాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు తీర్పుపై కేబినెట్‌లో చర్చించారు. న్యాయ నిపుణుల సలహాల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.

శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 50 శాతం భరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్లు ప్రతిపాదించిన హ్యామ్‌రోడ్ల ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks