...
...
Next Story

TG SSC Exams OMR 2026 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - వెబ్ సైట్ లో ఓఎంఆర్ షీట్, ఈ వీడియో చూడండి

Telangana SSC Exams OMR : పదో తరగతి విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ఓఎంఆర్ షీట్ పై అవగాహన కల్పించేందుకు వీలుగా ఓ వీడియోను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

Published on: Mar 12, 2026 08:41 AM IST
Advertisement

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈనెల 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి పరీక్షల్లో కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉండనుంది. ఈసారి కూడా ఆన్సర్ షీట్ కు ఓఎంఆర్ షీట్ ఉండనుంది. విద్యార్థులు…. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన OMR షీట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఓంఆర్ షీట్
ఓంఆర్ షీట్

ఈ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది…? దీన్ని పూర్తి చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అధికారులు ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వేర్వురు వీడియోలను అందుబాటులో ఉంచారు.

వీడియో ఇలా చూడండి…

  • ముందుగా https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని పదో తరగతి పరీక్షలు 2026 - ఓఎంఆర్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది.
  • దీనిపై క్లిక్ చేస్తే మీకు వీడియో ఓపెన్ అవుతుంది.
  • ఓఎంఆర్ షీట్ కు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.
  • ఈ వీడియోను చూసి విద్యార్థులు ఓ అవగాహనకు రావొచ్చు.

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ 2026 - షెడ్యూల్

  • 14-03-2026, శనివారం, ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II
  • 18-03-2026, బుధవారం, సెకండ్ లాంగ్వేజ్
  • 23-03-2026, సోమవారం, థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
  • 28-03-2026, శనివారం, మ్యాథమెటిక్స్
  • 02-04-2026, గురువారం, సైన్స్ పార్ట్-I(ఫిజికల్ సైన్స్)
  • 07-04-2026, మంగళవారం, సైన్స్ పార్ట్-II(బయోలాజికల్ సైన్స్)
  • 13-04-2026, సోమవారం, సోషల్ స్టడీస్
  • 15-04-2026, బుధవారం, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I(సంస్కృతం, అరబిక్), ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్స్(థియరీ)
  • 16-04-2026, గురువారం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II(సంస్కృతం, అరబిక్).

ఈ లింక్ పై క్లిక్ చేసి ఓఎంఆర్ వీడియో వీక్షించండి

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe