TGPSC DIET Lecturer Recruitment 2026 : తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ముఖ్యంగా విద్యా రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో (DIET) ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 29, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డైట్ కళాశాలల్లో మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యా సంస్థల అవసరాలకు అనుగుణంగా ఈ పోస్టులను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు.
- సీనియర్ లెక్చరర్లు: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని డైట్ సంస్థలలో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు.
- లెక్చరర్లు: వివిధ సబ్జెక్టులకు సంబంధించి డైట్ సంస్థలలో ఖాళీగా ఉన్న 63 లెక్చరర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
అర్హులైన అభ్యర్థులు ముందుగా టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ( https://www.tgpsc.gov.in ) లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే ఓటీఆర్ ఉన్నవారు తమ వివరాలను అప్‌డేట్ చేసుకుని, డైట్ లెక్చరర్ అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసే సమయానికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున….. అభ్యర్థులు గడువు ముగియడానికి ముందే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఈ ఫీజు రూ. 500 గా నిర్ణయించారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అభ్యర్థులందరూ అదనంగా రూ. 120 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం ఈ రూ. 120 పరీక్ష రుసుము నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.
{{/usCountry}}అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఈ ఫీజు రూ. 500 గా నిర్ణయించారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అభ్యర్థులందరూ అదనంగా రూ. 120 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం ఈ రూ. 120 పరీక్ష రుసుము నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.
{{/usCountry}}