తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల అయ్యాయి. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించారు. మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
గ్రూప్ 3 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి:
- అభ్యర్థులు https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని గ్రూప్ 3 ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్ట్ పై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ నెంబర్లతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందవచ్చు.

{{^htLoading}} {{/htLoading}}
రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో… ఈ ఏడాదిలో మార్చిలో ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు. అంతేకాకుండా ఫైనల్ కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ 3 ఫలితాల లిస్ట్ ను చెక్ చేసుకోవచ్చు
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}