...
...
Next Story

ఉద్యోగ అభ్యర్థులకు TGPSC అలర్ట్ - వెంటనే మీ వివరాలను అప్డేట్ చేసుకోండి

ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఓటీఆర్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఎస్సీ వర్గీకరణతో పాటు రాబోయే నోటిఫికేషన్ల నేపథ్యంలో ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని పేర్కొంది.

Published on: Jan 18, 2026 09:09 AM IST
Advertisement

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ముఖ్యమైన ప్రకటన విడుదలైంది.ఎస్సీ వర్గీకరణ, రాబోయే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో అభ్యర్థులు వారి వివరాలను సరిచూసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఓటీఆర్ (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది.

ఓటీఆర్ అప్డేట్ - ముఖ్యమైన తేదీలు…

టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ

ఈనెల 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు అభ్యర్థులు వారి వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ​తప్పనిసరిగా కొత్త కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.

అదనపు విద్యార్హతలు, చిరునామా , ఈడబ్యూఎస్, నాన్-క్రీమీ లేయర్ , మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీలను మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. మిగిలిన వివరాలు మార్చడానికి వీలుండదని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే OTR వివరాలనే భవిష్యత్తులో ఉద్యోగ దరఖాస్తులకు ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తారు…. కాబట్టి జాగ్రత్తగా పూర్తి చేయాలని కమిషన్ సూచించింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లయ్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఫోటో, సంతకం వంటివి ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే ప్రక్రియ. దీనివల్ల ప్రతిసారీ వివరాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఉద్యోగ నోటిఫికేషన్‌కు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe