టీజీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించారు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఈనెల 23 నుంచి హాల్ టికెట్లు….

ఈ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక అప్డేట్ ఇచ్చింది. రాత పరీక్ష హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీని ప్రకటించింది. ఈ నెల 23 ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.హాల్ టికెట్లు విడుదలైన తర్వాత https://www.tgprb.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఇక మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహిస్తారు. టీఎస్‌టీ పోస్టులకు 20,097, ఎంఎస్‌టీ పోస్టులకు 6,063 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
రాత పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. 3 గంటల సమయం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114 పోస్టులను భర్తీ చేస్తారు. డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండటమే కాకుండా మెడికల్ పరీక్షలుంటాయి.
"TSLPRB ఆధ్వర్యంలో 198 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు మార్చి 29న నిర్వహించనున్నారు. అభ్యర్ధులు తమ హాల్ టికెట్లను ఈ నెల 23వ తేదీ నుంచి http://tgprb.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు" అని తెలంగాణ పోలీస్ ట్వీట్ చేసింది.
{{/usCountry}}"TSLPRB ఆధ్వర్యంలో 198 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు మార్చి 29న నిర్వహించనున్నారు. అభ్యర్ధులు తమ హాల్ టికెట్లను ఈ నెల 23వ తేదీ నుంచి http://tgprb.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు" అని తెలంగాణ పోలీస్ ట్వీట్ చేసింది.
{{/usCountry}}