శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే మూడు పడవలు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజి వైపు దూసుకువెళ్లాయి. అయితే వాటిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సమయానికి నియంత్రించడం వల్ల పెనుప్రమాదం తప్పింది.

జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్లతో పాటు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రమాదాన్ని తప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కొట్టుకువచ్చిన పడవలను నియంత్రించకపోతే బ్యారేజి వద్ద భారీ విధ్వంసం జరిగి ఉండేది. లోతట్టు ప్రాంతాలు భారీ ముంపునకు గురైయ్యేవి. ఈ సంఘటనతో మరోసారి అందరికీ 2024 బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజీ ఘటన గుర్తుకొచ్చింది.
అసలు ఎం జరిగిందంటే ?
వరద ఉద్ధృతికి వంతెన రైలింగుకు కట్టేసిన పడవల తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పడవలు ఆనకట్ట వైపు వేగంగా కొట్టుకువచ్చాయి. వాటిలో ఒక పడవను ఇసుక రేవు ప్రాంతానికి, మరొకదాన్ని కనిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్ వద్దకు చేర్చగలిగారు.
మరో పడవ మాత్రం బ్యారేజీ ఎగువన సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న పాత ఆనకట్ట క్రెస్ట్ వద్ద నిలిచిపోయింది. ఒక వేళ ఆ బోట్లు అంతే వేగంగా వచ్చి సంఘం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టి ఉంటే విధ్వంసం జరిగి ఉండేది.
బోటు బరువు 35 టన్నులు ఉండడంతో బయటికి తరలించేందుకు ఇబ్బందులు పడ్డారు. బోటును బయటికి తీసేందుకు NDRF స్విమ్మర్స్ మరియు బృందం సభ్యలు సూమారు 12 గంటల పాటు శ్రమించి మూడు భారీ బోట్లు, తాళ్ళ సహాయంతో బోటును రెండు వైపుల కట్టి లంగర్ తో లాక్ చేశారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్లిష్టతరమైన సాహసానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు.
పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం….
మరోవైపు భారీ వర్షాలకు కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజి వద్ద దిగవకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని… లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని స్పష్టం చేశారు.
{{/usCountry}}మరోవైపు భారీ వర్షాలకు కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజి వద్ద దిగవకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని… లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని స్పష్టం చేశారు.
{{/usCountry}}