...
...
Next Story

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు - నేటి నుంచి అమల్లోకి..! ముఖ్యమైన వివరాలు

ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరుకుంది. ఈ కొత్త జిల్లాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటవుతాయి.

Published on: Dec 31, 2025, 06:08:36 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం ప్రధాన కార్యాలయంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయగా… మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు.

నేటి నుంచే అమల్లోకి..!

ఏపీలో కొత్త జిల్లాలు (image source TDP)
ఏపీలో కొత్త జిల్లాలు (image source TDP)

డిసెంబర్ 31 నుంచి జిల్లా పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. పునర్వ్యవస్థీకరణ వ్యాయామంలో భాగంగా రెవెన్యూ డివిజన్లు మరియు మండలాల సరిహద్దులలో మార్పులు కూడా నోటిఫికేషన్ లో ఉన్నాయి.

రాష్ట్రంలో 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో వీటి సంఖ్య 28కి చేరింది. ఈ కొత్త జిల్లాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

  • ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. ప్రజల డిమాండ్ మేరకు నెల్లూరుకి గూడూరు, తిరుపతికి రైల్వే కోడూరుకు వెళ్లాయి.
  • పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చారు.
  • గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు.
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉంటాయి.
  • అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుతుంది.
  • ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలుస్తాయి.
  • నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చారు.
  • సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్‌కు మార్చారు.
  • అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌‌తో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటవుతుంది.
  • కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏపీలో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప(40) జిల్లా నిలవనుంది.
  • జనాభా విషయానికి వస్తే ఏపీలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా తిరుపతి ఉంటుంది.
  • జనాభా పరంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా పోలవరం నిలుస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks