రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు.

'విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులను వేగవంతం చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా దానిని పునరుద్ధరించేలా చూడాలి. అలాగే విద్యుత్ వ్యవస్థ విశ్వసనీయతను బలోపేతం చేయాలి.' అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అలానే అత్యవసర సేవల విభాగాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ అంతరాయాల వల్ల రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
రాష్ట్రంలోని సుమారు 30 ప్రధాన ఆస్పత్రుల్లో జనరేటర్ల పనితీరును సమీక్షించి, కరెంట్ నిలిచిపోయిన సమయంలో స్విచ్ ఓవర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. అలాగే విద్యుత్ శాఖ చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే పునరుద్ధరణ చేయడానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు చెప్పారు.
వేసవికాలంలో ఎదురైన విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి, సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి సారించాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజలపై అదనపు భారం మోపకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, డైరెక్టర్లు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
{{/usCountry}}వేసవికాలంలో ఎదురైన విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి, సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి సారించాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజలపై అదనపు భారం మోపకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, డైరెక్టర్లు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
{{/usCountry}}