AP Inter Results 2026 :ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇవాళ ఉదయం 10.31 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇవాళ ఉదయం 10.31 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను వెల్లడిస్తారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 23 వరకు కొనసాగాయి. ఫస్ట్ ఇయర్ లో కొత్తగా అమల్లోకి తెచ్చిన కొన్ని విధానాల వల్ల పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టినప్పటికీ…. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మే నెలకు ముందే ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. నిర్దేశించుకున్న సమయంలోపే స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావటంతో… బుధవారం ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఇంటర్ పరీక్షలకు మొత్తం సుమారు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5.31 లక్షలు, రెండో సంవత్సరం విద్యార్థులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఫలితాల వెల్లడి అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా ఇంటర్ బోర్డు ప్రకటించనుంది.
ఏపీ ఇంటర్ ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సాయంతో https://resultsbie.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు,
- మనమిత్ర వాట్సప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ సెండ్ చేయాలి.
- రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోవాలి.
- తర్వాత ‘Education Services’ ఆప్షన్ క్లిక్ చేయండి.
- ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి అని కనబడుతుంది.
- ఫలితాల డౌన్లోడ్ ఆప్షన్ యాక్టివ్ అయిన తర్వాత మీ హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
- మీ వాట్సప్ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.