...
...
Next Story

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం - హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి

నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

Published on: Dec 26, 2025, 09:19:20 IST
Advertisement

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం రోడ్డు డివైడర్ ను కొట్టి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్వాలిస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడ్డవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తోంది. ఇక క్వాలిస్ వాహనం… తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రోడ్డు ప్రమాదంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గుంటూరులో మరో రోడ్డు ప్రమాదం:

గుంటూరు జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది. ఆగిఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులను తెలంగాణలోని సూర్యాపేట వాసులని తెలిసింది. తిరుపతి నుంచి సూర్యాపేట వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks