...
...
Next Story

తిరుమల లడ్డూ కేసు : కల్తీ నెయ్యి సరఫరా వెనుక కుట్ర - వెలుగులోకి కీలక విషయాలు..!

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరెస్ట్‌తో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Published on: Oct 30, 2025, 22:31:27 IST
Advertisement

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది.

తిరుమల లడ్డూ కేసు - సిట్ విచారణలో కీలక విషయాలు
తిరుమల లడ్డూ కేసు - సిట్ విచారణలో కీలక విషయాలు

కల్తీ నెయ్యి కేసులో అప్పన్న ఏ- 24గా ఉన్నాడు. బుధవారం రాత్రి సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేయగా.. నెల్లూరులోని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక విషయాలను పేర్కొంది.

వెలుగులోకి కీలక విషయాలు…!

సిట్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం… 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించారు. నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశాడు. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ (కేజీ రూ. 329) ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కమీషన్ ఇవ్వడానికి భోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించింది. దీంతో బోలేబాబా డెయిరీపై అనర్హత వేటు వేసేలా చిన్న అప్పన్న కుట్ర పన్నాడు. భోలేబాబా డెయిరీని తనిఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. భోలేబాబా డెయిరీపై అనర్హతవేటు వేసేలా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు కూడా వేయించాడు.

చిన్నఅప్పన్న కుట్రతో బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణ నిలిచిపోయింది. భోలేబాబా డెయిరీ స్థానంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థ ప్రవేశించింది. భోలేబాబా కంటే కిలోకు రూ.138 ఎక్కువ (కేజీ 467) ప్రీమియర్ సంస్థ కోట్ చేసింది. పోటీ లేకపోవడంతో కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ వ్యవహారంలో చిన్నఅప్పన్నకు రూ.50 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు సిట్ గుర్తించింది. అప్పన్న బ్యాంకు లావాదేవీలు పరిశీలించింది.

ఈ కేసులో సిట్ ముందుగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో 15 మందిని నిందితులుగా పేర్కొంది. ఇప్పుడు కొత్తగా 9 మందిని చేర్చింది. ఇందులో ఒకరిగా చిన్న అప్పన్న ఉన్నారు. కస్టడీలో సేకరించే సమాచారం ఆధారంగా సంచలన విషయాలు బయటికొచ్చే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe