...
...
Next Story

AP SSC Results : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు మే 7 వరకు ఛాన్స్, వాట్సప్‌లోనూ జవాబు పత్రాలు

AP 10th Result Reverification : పదో తరగతి ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మే 7 వరకు అవకాశం ఉంది. ఈసారి మనమిత్ర వాట్సాప్ ద్వారా జవాబు పత్రాల స్కాన్ కాపీలను పొందే వినూత్న సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Published on: May 3, 2026, 10:22:11 IST
Advertisement

AP 10th Result Reverification : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆశించిన మార్కులు రాలేదని భావిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఊరటనిచ్చే వార్త చెప్పింది. జవాబు పత్రాల రీకౌంటింగ్ (Recounting) మరియు రీవెరిఫికేషన్ (Reverification) ప్రక్రియకు సంబంధించి కీలక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు….. ఈ నెల 7వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం….

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ (image istock)
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ (image istock)

పదో తరగతి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి అధికారికంగా వెల్లడించారు. విద్యార్థులు తమకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (Headmasters) ద్వారానే ఈ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వ్యక్తిగత దరఖాస్తుల కంటే పాఠశాల లాగిన్ ద్వారా వచ్చే దరఖాస్తులకే ప్రాధాన్యత ఉంటుంది.

ఫీజు వివరాలు ఇలా..

  • విద్యార్థులు తాము ఎంచుకునే సేవను బట్టి నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
  • రీకౌంటింగ్: కేవలం మార్కుల లెక్కింపులో ఏవైనా పొరపాట్లు జరిగాయో లేదో తెలుసుకోవాలనుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి.
  • రీవెరిఫికేషన్: జవాబు పత్రం మొత్తాన్ని తిరిగి పరిశీలించి, స్కాన్ చేసిన కాపీని పొందాలనుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ ఫీజులను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ పద్ధతుల్లో ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని కల్పించారు.

ఈసారి వాట్సాప్ కే….

ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ఒక వినూత్న మార్పును ప్రవేశపెట్టింది. గతంలో రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలను కేవలం పాఠశాల లాగిన్‌లలో మాత్రమే ఉంచేవారు. కానీ…. ఈసారి డిజిటల్ విప్లవంలో భాగంగా 'మనమిత్ర' పేరుతో ప్రత్యేక వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ కాపీలను నేరుగా 9552300009 అనే వాట్సాప్ నంబరు ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డైరెక్టర్ వివరించారు.

మరోవైపు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2026 (AP SSC Supplementary Exams)కు సంబంధించి షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు 25-05-2026 నుంచి 04-06-2026 వరకు జరుగుతాయి.

సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి…. విద్యార్థులు ఆలస్య రుసుము నుంచి తప్పించుకోవడానికి సరైన సమయంలో ఫీజు చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా..09-05-2026 చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో 10-05-2026 నుంచి 24-05-2026 వరకు చెల్లించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks