...
...
Next Story

ఏపీకి రూ.82 వేల కోట్ల పెట్టుబడి.. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ!

ఏపీలో మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

Updated on: Nov 13, 2025, 10:20:37 IST
Advertisement

ఏపీలో పెట్టుబుడులు క్యూ కడుతున్నాయి. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025కి ముందే పలు కంపెనీలు ఏపీలో తమ పెట్టుబడుల గురించి ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడులను ఏపీకి ప్రకటించింది. రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో సంస్థ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ జరగనున్నట్టుగా పేర్కొన్నారు.

ఏపీకి భారీగా పెట్టుబడులు
ఏపీకి భారీగా పెట్టుబడులు

ఈ పెట్టుబడితో కంపెనీ నాలుగు ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. మొదటిది 6 జిగావాట్ (GW) సౌర PV ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్, రెండో 6.3 GWp హైబ్రిడ్ సైట్స్ ప్లస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, మూడో 2 GW హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, నాల్గోది 300 KTPA గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. వీటితోపాటుగా ఒకే ప్రదేశంలో 4.8 GWp రెన్యూ అతిపెద్ద హైబ్రిడ్ సైట్ + BESS కూడా వస్తుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 10,000కి పైగా ప్రత్యక్షంగా/పరోక్షంగా ఉద్యోగాలను రానున్నాయి.

ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చామన్నారు. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నామని చెప్పారు.

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని వివరిస్తున్నాను.' అని నారా లోకేశ్ అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe