...
...
Next Story

SCR Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్ - పలు ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. లిస్టులో అరుణాచలం, కొల్లాం!

SCR Summer Special Trains 2026 : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి నుంచి నడిచే పలు వీక్లీ స్పెషల్ రైళ్లను జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.

Published on: May 09, 2026 08:41 AM IST
Advertisement

SCR Summer Special Trains 2026 : వేసవి సెలవుల వేళ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా… తాజాగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. వేసవి సెలవుల కారణంగా రైళ్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్లను మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలగనుంది.

పొడిగించిన రైళ్ల పూర్తి వివరాలు:

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

1. నర్సాపూర్ - తిరువణ్ణామలై (రైలు నం. 07219/07220): ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే భక్తుల కోసం ఈ రైలును పొడిగించారు.

  • 07219 (నర్సాపూర్ - తిరువణ్ణామలై): జూన్ 3 నుంచి జూన్ 24 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది.
  • 07220 (తిరువణ్ణామలై - నర్సాపూర్): జూన్ 4 నుంచి జూన్ 25 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 4 అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

2. హైదరాబాద్ - కొల్లాం (రైలు నం. 07193/07194): కేరళ పర్యాటకానికి వెళ్లేవారికి, దక్షిణ భారత్ యాత్రికులకు ఈ రైలు ఎంతో కీలకం.

  • 07193 (హైదరాబాద్ - కొల్లాం): మే 30 నుంచి జూన్ 27 వరకు ప్రతి శనివారం నడుస్తుంది.
  • 07194 (కొల్లాం - హైదరాబాద్): జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
  • ఈ మార్గంలో మొత్తం 5 అదనపు సర్వీసులుంటాయి.

3. చర్లపల్లి - తిరుచిరాపల్లి (రైలు నం. 07615/07616): హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి టెర్మినల్ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది.

  • 07615 (చర్లపల్లి - తిరుచిరాపల్లి): జూన్ 9 నుంచి జూన్ 30 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది.
  • 07616 (తిరుచిరాపల్లి - చర్లపల్లి): జూన్ 10 నుంచి జూలై 1 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
  • ఈ మార్గంలో 4 సర్వీసులను పొడిగించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe