అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇటీవలనే చర్లపల్లి, నర్సాపుర్, మచిలీపట్నం నుంచి 50 రైళ్లను ప్రకటించగా… తాజాగా వేర్వురు స్టేషన్ల నుంచి మరో 54 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.
మరో 54 ప్రత్యేక రైళ్లు…

కొద్దిరోజులుగా శబరిమలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శబరిమలకు తాజాగా 54 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం… ఈ రైళ్లు కాకినాడ, నాందేడ్, చర్లపల్లి స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది.
ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 17, 2025 నుంచి జనవరి 20, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసులు ఏపీ, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలను కలుపుతూ కేరళలోని కొల్లాం జంక్షన్ లేదా కొట్టాయం వరకు నడవనున్నాయి.
కాకినాడ టౌన్ - కొట్టాయం (07109/07110) మధ్య రాను పోను కలిపి మొత్తం 18 రైళ్లు అందుబాటులో ఉంటాయి. సోమ, మంగళవారం తేదీల్లో రాకపోకలు ఉంటాయి. ఈ ట్రైన్స్ రాజమండ్రి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}కాకినాడ టౌన్ - కొట్టాయం (07109/07110) మధ్య రాను పోను కలిపి మొత్తం 18 రైళ్లు అందుబాటులో ఉంటాయి. సోమ, మంగళవారం తేదీల్లో రాకపోకలు ఉంటాయి. ఈ ట్రైన్స్ రాజమండ్రి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}ఇక హెచ్.ఎస్. నాందేడ్ - కొల్లాం (07111/07112) మధ్య రానుపోను కలిపి మొత్తం 18 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. బుధ, శనివారం తేదీల్లో జర్నీ ఉంటుంది.ఈ ప్రత్యేక రైళ్లు నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ, రేణిగుంట, తిరుపతి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.
మరోవైపు హైదరాబాద్ లోని చర్లపల్లి - కొల్లాం (07113/07114) మధ్య రానుపోను కలిపి 18 ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, కడప, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.