...
...
Next Story

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్‌ - స్పర్శ దర్శనాలు పెంపు, ఎప్పట్నుంచంటే..?

శ్రీశైలం మల్లన్న భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని స్పర్శ దర్శనాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది.

Published on: Dec 19, 2025, 12:20:16 IST
Advertisement

శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది. స్పర్శ దర్శనాలకు సంబంధించిన టైమింగ్స్ ను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

అమలు ఎప్పట్నుంచంటే..?

శ్రీశైలం
శ్రీశైలం

తాజా నిర్ణయం ప్రకారం….. ప్రతి వారం శని, ఆదివారాలు మరియు సోమవారాల్లో మల్లన్న స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజుల్లో ప్రతి 2 గంటలకు ఒకసారి స్పర్శ దర్శన స్లాట్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది.

జనవరి నుంచి వీకెండ్స్ రోజుల్లో స్లాట్ల ద్వారా భక్తులకు స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేస్తారు. వీఐపీ బ్రేక్‌ ఉదయం 6 గంటల నుంచి 7 వరకు, స్పర్శ దర్శనం ఉదయం 7 గంటల నుంచి 8.30 వరకు ఉంటుంది. ఇక వీఐపీ బ్రేక్‌ దర్శనం ఉదయం 10.30-11.30 వరకు, స్పర్శ దర్శనం ఉ.11.45-మధ్యాహ్నం 2 గంటల వరకు కల్పిస్తారు. వీఐపీ బ్రేక్‌ రాత్రి 7.45-8 గంటల వరకు, స్పర్శ దర్శనం రాత్రి 9-11 వరకు ఉంటుందని ఆలయ ఈవో వివరించారు.

మొత్తం 5 స్పర్శ దర్శన స్లాట్లకు ఆన్‌లైన్‌ ద్వారానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేయరు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న స్వామిని స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారాంతాలు, సోమవారాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఆన్‌లైన్ సేవలను www.aptemples.ap.gov.in లేదా www.srisailadevasthanam.org లేదా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా మాత్రమే పొందవచ్చు. స్పర్శ దర్శనం, అర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారు టికెట్ ప్రింటెడ్ కాపీని, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని తీసుకురావాలి. టికెట్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయాలి, ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ను చూపించాలి. ఆన్‌లైన్ టికెట్‌ను స్కాన్ చేసిన తర్వాతే దర్శనం లేదా సేవలకు ప్రవేశం అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks