అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇకపై FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో అంగ ప్రదక్షిణ టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ మార్పును గమనించి భక్తులు…. అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
నిజానికి ఈ ఏడాది ఆగస్టు నెలలోనే అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న ఫిఫో ( ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్) పద్ధతి స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోకెన్లను మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల చేసింది. అయితే ఈ విధానంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు అభ్యంతరాలను కూడా టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంనే… టీటీడీ లక్కీడిప్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి సారె ట్రయల్ రన్:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నవంబరు 25న పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ గురువారం విజయవంతంగా నిర్వహించారు.
తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
{{/usCountry}}తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
{{/usCountry}}ముందుగా శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేంచేపు చేశారు.