...
...
Next Story

తునిలో బాలికపై అత్యాచార కేసు - చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య, మేజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్తుండగా ఘటన

తునిలో బాలికపై అత్యాచార ఘటన కేసులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నారాయణరావు.. తుని కోమటిచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Published on: Oct 23, 2025, 08:24:34 IST
Advertisement

కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారటంతో విషయం బయటికి వచ్చింది. దీంతో నిందితుడైన నారాయణరావుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

నిందితుడు నారాయణరావు
నిందితుడు నారాయణరావు

బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ వద్దకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పిన నారాయణరావు(62) సమీపంలోని కోమటిచెరవులో దూకాడు. తుని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా… నారాయణరావు మృతదేహాం లభ్యమైంది.

అసలేం జరిగిందంటే..?

తుని రూరల్‌ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికను నారాయణ రావు అనే వ్యక్తి హాస్టల్ నుంచి స్కూటీపై తీసుకెళ్లాడు. సమీపంలోని హంసవరం సపోటా తోటల్లో తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా తాకాడు. అత్యాచారం చేసేందుకు యత్నించబోయాడు.

ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని ఓ స్థానికుడు గమనించాడు. అతని వద్దకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. బాలికను తోటలోకి తీసుకొచ్చి అత్యాచారం చేస్తున్నావా అని నిలదీశాడు. అలాంటిదేమీ లేదు… బాలికను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని దబాయించాడు. అంతటితో ఆగని నారాయణరావు… తాను ఓ పార్టీ కౌన్సిలర్‌ను అంటూ చెప్పుకొచ్చాడు. పలు అంశాలపై ప్రశ్నిస్తుండగానే… స్కూటీపై సదరు బాలికను ఎక్కించుకోని నారాయణరావు వెళ్లిపోయాడు. ఇదంతా కూడా వీడియోలో రికార్డు అయింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe