...
...
Next Story

Anasuya on Bandi Bhagirath: అన్ని విషయాలు నాకు తెలియవు.. ఇదో శాపం.. గుడ్డిగా స్పందించలేను: బండి భగీరథ్ కేసుపై అనసూయ

Anasuya on Bandi Bhagirath: బండి భగీరథ్ వివాదంపై నటి అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై గుడ్డిగా స్పందించలేనని, నిజానిజాలు తెలియకుండా తీర్పులు ఇవ్వడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Published on: May 14, 2026 03:37 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Anasuya on Bandi Bhagirath: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే పలు పరిణామాలపై గళమెత్తే నటి అనసూయ భరద్వాజ్.. తాజాగా బండి భగీరథ్ వ్యవహారంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

Anasuya on Bandi Bhagirath: అన్ని విషయాలు నాకు తెలియవు.. ఇదో శాపం.. గుడ్డిగా స్పందించలేను: బండి భగీరథ్ కేసుపై అనసూయ
Anasuya on Bandi Bhagirath: అన్ని విషయాలు నాకు తెలియవు.. ఇదో శాపం.. గుడ్డిగా స్పందించలేను: బండి భగీరథ్ కేసుపై అనసూయ

దీనిపై తన స్పందన కోరుతున్న నెటిజన్లకు, అభిమానులకు అనసూయ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సత్యమేవ జయతే అనే క్యాప్షన్ తో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.

అంతా ఒక శాపం, ఒక వరం

ప్రజా సమస్యలపై తాను స్పందించాలని ప్రజలు కోరుకోవడం ఒక రకంగా వరం అయితే, మరో రకంగా అది శాపమని అనసూయ వ్యాఖ్యానించారు.

"ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందని భావించే వారందరికీ నేనొకటి చెప్పదలుచుకున్నాను. నాకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉండదు. ప్రతిసారీ సమయం కూడా దొరకదు. ఏదైనా విషయంపై నాకు పూర్తిస్థాయిలో క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే నేను మాట్లాడుతాను" అని ఆమె పేర్కొన్నారు.

నిజాలు తేలకముందే తీర్పులా?

ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను తాను కూడా గమనిస్తున్నానని, అయితే పూర్తి వాస్తవాలు బయటకు రాకుండా ఒక ముగింపునకు రావడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

"నేను కూడా అందరిలాగే మీడియా అప్‌డేట్స్ చూస్తున్నాను. నిజాలు అధికారికంగా నిర్ధారణ అయ్యే వరకు మనం కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తే మంచిది. సోషల్ మీడియాలో ఇన్ స్టంట్ ఓపినియన్స్ ఇవ్వడం చాలా ఈజీ.. కానీ బాధ్యతాయుతంగా ఒక పద్ధతిని గౌరవించడం ముఖ్యం" అని అనసూయ స్పష్టం చేశారు.

శిక్ష పడాల్సిందే.. కానీ

"నిజంగా తప్పు జరిగితే చట్టం తన పని తాను చేస్తుంది. కానీ వాస్తవాలు తెలియకుండా చేసే విమర్శల వల్ల జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు" అని అనసూయో వివరించారు.

ట్రెండింగ్ కోసం మాట్లాడను

కేవలం ఏదైనా విషయం 'ట్రెండింగ్‌'లో ఉందని తాను మాట్లాడనని, ఒక మనిషిగా, వర్కింగ్ పేరెంట్‌గా తనకు నమ్మకం కలిగినప్పుడే గళం విప్పుతానని అనసూయ తేల్చి చెప్పారు.

"నా మనసుకు ఏదైనా తప్పు అనిపించినప్పుడు అది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. అంతవరకు నాకు కొంచెం క్లోజర్ కావాలి" అని తన వ్యక్తిత్వాన్ని చాటిచెప్పారు.

అయితే అనసూయ చేసిన ఈ పోస్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు భయపడుతున్నావా అని ఆమెను నిలదీస్తుండగా.. మరికొందరు మాత్రం మీరు చెప్పింది నిజమే అంటూ ఏకీభవిస్తున్నారు.

మొత్తానికి బండి భగీరథ్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించకుండా, నిశితంగా గమనిస్తున్నట్లు అనసూయ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: బండి భగీరథ్ కేసుపై అనసూయ నేరుగా విమర్శలు చేశారా?

జవాబు: లేదు.. ఆమె నేరుగా ఎవరినీ విమర్శించలేదు. వాస్తవాలు తెలిసే వరకు ఓపిక పట్టాలని, చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని మాత్రమే ఆమె సూచించారు.

ప్రశ్న: అనసూయ తన ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రధానంగా ఏం చెప్పారు?

జవాబు: సోషల్ మీడియాలో వచ్చే అరకొర సమాచారంతో ఎవరినీ జడ్జ్ చేయకూడదని, నిజాలు నిరూపితమైతే శిక్ష పడాల్సిందేనని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe