...
...
Next Story

ఇదో మాస్టర్‌పీస్.. ఏమాత్రం ఆలోచించకుండా చూసేయండి: కుబేర మూవీపై నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్

కుబేర మూవీని రెండు ముక్కల్లో చెప్పేశాడు కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇదో మాస్టర్ పీస్ అని అతడు స్పష్టం చేశాడు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Published on: Jun 20, 2025 04:26 PM IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నాలాంటి క్రేజీ కాంబినేషన్ తో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కుబేర. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూన్ 20) పాన్ ఇండియా స్థాయిలో మూవీ రిలీజైంది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ మూవీని ఓ మాస్టర్ పీస్ అని అనడం విశేషం.

నాగ్ అశ్విన్ కుబేర రివ్యూ

ఇదో మాస్టర్‌పీస్.. ఏమాత్రం ఆలోచించకుండా చూసేయండి: కుబేర మూవీపై నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్
ఇదో మాస్టర్‌పీస్.. ఏమాత్రం ఆలోచించకుండా చూసేయండి: కుబేర మూవీపై నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్

కుబేర మూవీపై నాగ్ అశ్విన్ శుక్రవారం (జూన్ 20) ఉదయమే రివ్యూ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు ఈ సినిమాను ఓ మాస్టర్ పీస్‌గా అభివర్ణించాడు. ఏమాత్రం ఆలోచించకుండా మూవీకి వెళ్లాలని ప్రేక్షకులకు సూచించాడు.

“మాస్టర్ ఫ… పీస్. ఆలోచించకండి. వెళ్లండంతే” అనే క్యాప్షన్ తో థియేటర్లలో మూవీని ప్రదర్శిస్తున్న ఫొటోను షేర్ చేశాడు. అతని పోస్ట్ వెంటనే వైరల్ గా మారిపోయింది. గతేడాది కల్కి 2898 ఏడీలాంటి బ్లాక్‌బస్టర్ అందించిన నాగ్ అశ్విన్.. కుబేరకు రెండు ముక్కల్లో ఇలాంటి రివ్యూ ఇవ్వడం ఆ సినిమాకు మరింత కలిసి రానుంది.

కుబేర మూవీ గురించి..

కుబేర మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ లోకి దర్శకుడిగా అడుగుపెట్టి 25 ఏళ్లయిన సందర్భంగా రిలీజైన ఈ సినిమా అతని కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కుబేరను ఓ క్రైమ్ థ్రిల్లర్ గా అతడు తెరకెక్కించాడు. ఇది ఒక లక్ష కోట్ల స్కామ్ కథ. ఈ స్కామ్‌లో ఒక బిలినియర్, ఓ బెగ్గర్, ఒక సీబీఐ ఆఫీసర్ ఎలా వచ్చారన్న ఎంగేజింగ్ సీన్లతో సాగే సినిమానే కుబేర.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe