Raw Mango Peanuts Chutney : సమ్మర్ స్పెషల్.. పచ్చి మామిడి వేరుశెనగల చట్నీ.. చిటికెలో చేసేసే రెసిపీ
Raw Mango Peanuts Chutney : వేసవి వచ్చేసింది.. మార్కెట్‌లో పచ్చి మామిడి దొరుకుతుంది. అయితే ఈ రా మ్యాంగోతో వేరుశెనగలు కలిపి అద్భుతమైన చట్నీ చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూసేయండి.
వేసవి ప్రారంభమైంది. మామిడి పండ్ల సీజన్ కూడా మొదలైంది. వేసవి కాలమంతా చాలా మంది ఇళ్లలో ప్రతిరోజూ ఏదో ఒక విధంగా మామిడి పండ్లను తింటూ ఉంటారు. సాధారణంగా మామిడి పండ్లను సాంబార్, రసం, జామ్, పచ్చడి, కుల్ఫీ వంటి అనేక రకాలుగా తింటారు. కానీ అదే పచ్చి మామిడితో చట్నీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? అదీ కూడా వేరుశెనగలతో కలిపి చేసిన మామిడి చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోసెలతో మాత్రమే కాదు.. వేడివేడి అన్నంతో కూడా చాలా బాగుంటుంది.
పచ్చి మామిడి వేరుశెనగల చట్నీ
{{^htLoading}} {{/htLoading}}
పచ్చి మామిడి వేరుశెనగ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? రెసిపీ విధానం ఇక్కడ ఉంది. ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
నూనె - 3 చెంచాలు, మినప పప్పు - 3 చెంచాలు, వేరుశెనగలు - ఒక గుప్పెడు, అల్లం - 3 ముక్కలు, ఎండు మిరపకాయలు - 4, మిరియాల పొడి-కాస్త, వెల్లుల్లి - 6, పెద్ద ఉల్లిపాయ - 1 (తరిగినది), కరివేపాకు - ఒక గుప్పెడు, మామిడి - 1 (ముక్కలుగా కోసినది), ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - 1/2 టీస్పూన్.
ఎలా చేయాలి?
ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టి, అందులో నూనె పోసి వేడి చేశాక, మినప పప్పు వేసి బాగా వేయించండి.
తర్వాత వేరుశెనగలను వేసి బాగా వేయించండి.
ఆ తర్వాత తరిగిన అల్లం, మిరియాల పొడి వేసి బాగా వేయించండి. తరువాత, వెల్లుల్లి వేసి వేయించండి.
ఆ తర్వాత తరిగిన పెద్ద ఉల్లిపాయ వేసి, అది మెత్తబడే వరకు వేయించండి.
తర్వాత కరివేపాకు, మామిడి ముక్కలు వేసి బాగా వేయించి చల్లారనివ్వండి.
తరువాత, వేయించిన పదార్థాలను ఒక మిక్సర్ జార్‌లో వేసి, రుచికి తగినంత ఉప్పు చల్లి, కొద్దిగా గరుకుగా గ్రైండ్ చేయండి.
తర్వాత గ్రైండ్ చేసిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని, జార్‌లో ఎక్కువ నీళ్లు పోయకుండా, మితంగా పోస్తూ కొద్దిగా చిక్కగా అయ్యే వరకు కలపండి.
చివరగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయండి. ఆవాలు, మినప పప్పు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి చట్నీతో కలపండి. అంతే మీ రుచికరమైన పచ్చి మామిడి వేరుశెనగ చట్నీ సిద్ధం.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.