...
...
Next Story

పీఎం కిసాన్ 20వ విడత నిధులు ఈ తేదీలో వచ్చే అవకాశం.. లబ్ధిదారులు ఈ పని చేశారా?

దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ పథకం 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విడత డబ్బు ఎప్పుడు విడుదల అవుతుంది?

Published on: Jul 10, 2025 02:01 PM IST
By ,
Prefer HTon Google
Advertisement

దేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చే పథకం పీఎం కిసాన్. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విడత జూలై 18న రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో బీహార్ సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 అందజేస్తారు.

పీఎం కిసాన్ 20వ విడత నిధులు
పీఎం కిసాన్ 20వ విడత నిధులు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాబోయే రూ.2,000 వాయిదాను కోల్పోకుండా ఉండటానికి ప్రతి లబ్ధిదారుడు అనుసరించాల్సిన దశలను మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రభుత్వం ఇంకా అధికారికంగా చెల్లింపు తేదీని నిర్ధారించనప్పటికీ.. జూలైలో 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ పనులు చేశారా?

వ్యవసాయమంత్రిత్వ శాఖ ప్రకారం, అర్హత కలిగిన రైతులు తదుపరి విడత పొందడానికి కొన్ని పనులను పూర్తి చేయాలి. e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించాలి. భూమి రికార్డు సమస్యలను పరిష్కరించాలి. లబ్ధిదారుడి స్టేటస్ చెక్ చేయాలి. మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేయాలి. తప్పు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ లేదా ఖాతా నంబర్‌లు.. ట్రాన్స్‌ఫర్ వైఫల్యానికి దారితీయవచ్చు. భూమి యాజమాన్యాన్ని డిజిటల్ రికార్డులలో ధృవీకరించాలి.

ఇలా చేయండి

పీఎం కిసాన్ వాయిదా సాధారణంగా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లలో వస్తుంది. ఈసారి 20వ విడత ఆలస్యం అయింది. చెల్లింపు వైఫల్యాన్ని నివారించడానికి అర్హత ఉన్న రైతులు ముందుగా e-KYCని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ వాయిదాల స్థితిని తనిఖీ చేయడానికి pmkisan.gov.inని సందర్శించండి.

మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తనిఖీ చేయండి.

eKYC పూర్తయిందని కన్ఫామ్ చేసుకోండి.

2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం అతిపెద్ద డీబీటీ స్కీమ్. దీని కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 లభిస్తుంది. ఏటా రూ. 6,000 ఇస్తారు. డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe