...
...
Next Story

తారలు దిగివచ్చిన వేళ.. అఖిల్ అక్కినేని పెళ్లి రిసెప్షన్ ఫొటోలు వైరల్.. ఓ లుక్కేయండి

అఖిల్ అక్కినేని, జైనాబ్ రవ్దీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఆదివారం (జూన్ 8) రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ఈవెంట్ కు సౌత్ సినిమా ఇండస్ట్రీ తారలు వచ్చారు. పొలిటికల్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఫొటోలను అన్నపూర్ణ స్టూడియోస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

Published on: Jun 9, 2025, 09:30:22 IST
By ,
Prefer HTon Google
Advertisement
<p>అఖిల్ తో అక్కినేని కుటుంబం ఇలా ఫోజు ఇచ్చిన ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో నాగ చైతన్య, సుమంత్, సుశాంత్ కూడా ఉన్నారు. </p>

అఖిల్ తో అక్కినేని కుటుంబం ఇలా ఫోజు ఇచ్చిన ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో నాగ చైతన్య, సుమంత్, సుశాంత్ కూడా ఉన్నారు.

ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దంపతులు ఇలా అఖిల్, జైనాబ్ రిసెప్షన్ లో పాలు పంచుకున్నారు.

తమిళ్ స్టార్ హీరో సూర్య ఈ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రీసెంట్ గా రెట్రో మూవీతో సూర్య బ్లాక్ బస్టర్ కొట్టారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా అఖిల్, జైనాబ్ రిసెప్షన్ కు వెళ్లారు. తండ్రి నాగార్జున, తనయుడు అఖిల్ మధ్య నిలబడి ఇలా ఫోజు ఇచ్చారు రామ్ చరణ్.

అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు భార్య నమత్ర, కూతురు సితారాతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు అటెండ్ అయ్యారు. ఈ ఫొటోలు మహేష్ లుక్ వైరల్ గా మారింది. ఆయన ఏజ్ మరింత తగ్గిందనే కామెంట్లు వస్తున్నాయి.

కేజీఎఫ్ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాకీ భాయ్ యశ్ కూడా అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో పాల్గొన్నారు.

తన భార్యతో కలిసి నేచురల్ స్టార్ నాని ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ఇటీవల హిట్ 3 మూవీ సక్సెస్ తో జోరుమీదున్నారు నాని. నాని, నాగార్జున కలిసి దేవదాస్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అఖిల్, జైనాబ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. సీఎంను నాగార్జున సాదారంగా ఆహ్వానించారు.

అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు విక్టరీ వెంకటేష్ దంపతులు హాజరయ్యారు. నాగార్జునతో కలిసి ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe