...
...
Next Story

కోహ్లి ప్రపంచ రికార్డుకు బాబర్ ఆజం ఎసరు- టీ20 రికార్డు సమం- టాప్-5లో ఈ బ్యాటర్లు

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డుకు బాబర్ ఆజం ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇప్పటికే ఈ రికార్డును అతను సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓ లుక్కేయండి.

Published on: Nov 24, 2025, 10:22:01 IST
Advertisement
<p>జింబాబ్వేతో జరిగిన ట్రై సిరీస్ నాలుగో మ్యాచ్‌లో బాబర్ ఆజం తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 38వ అర్ధసెంచరీ సాధించాడు. దీంతో అతను విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.</p>

జింబాబ్వేతో జరిగిన ట్రై సిరీస్ నాలుగో మ్యాచ్‌లో బాబర్ ఆజం తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 38వ అర్ధసెంచరీ సాధించాడు. దీంతో అతను విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

జింబాబ్వేపై 74 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు బాబర్. టీ20 ఇంటర్నేషనల్‌లో బాబర్ కు ఇది 38వ అర్ధసెంచరీ. దీంతో అతను విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్‌ను సమం చేశాడు.

టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన తర్వాత ఈ ఫార్మాట్ కు కోహ్లి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అత్యధికంగా 38 అర్ధసెంచరీలు సాధించాడు. అయితే, ఇప్పుడు బాబర్ ఈ కోహ్లి రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది.

మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ 32 అర్ధసెంచరీలతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ తన టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో 151 ఇన్నింగ్స్‌లలో 32 అర్ధసెంచరీలు సాధించాడు.

పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. రిజ్వాన్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 30 అర్ధసెంచరీలు సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న డేవిడ్ వార్నర్ ఇప్పటికీ టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఉన్నాడు. వార్నర్ తన టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో 28 అర్ధసెంచరీలు సాధించాడు. అతనితో పాటు, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఈ ఫార్మాట్‌లో 28 ఫిఫ్టీలు సాధించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe