...
...
Next Story

బిగ్ బాస్ 9 తెలుగులో రఫ్పాడిస్తున్న తెలుగు సీరియల్ హీరోయిన్- ఉత్తమ నటిగా అవార్డ్- ఎవరీ ఆయేషా జీనత్? ఆమె సినిమాలు, షోలు!

బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగుతోంది. ఇటీవల అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మరింత రంజుగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు 9 సీజన్. అయితే, ఈ షోలోకి రాయల్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు సీరియల్ హీరోయిన్ ఆయేషా జీనత్. తన అందచందాలతో రఫ్పాడిస్తున్న ఆయేషా జీనత్ బ్యాక్‌గ్రౌండ్‌పై లుక్కేద్దాం.

Published on: Oct 23, 2025, 21:10:44 IST
Advertisement
<p>బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారు. అక్టోబర్ 12న బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆయేషా జీనత్.<br> </p>

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారు. అక్టోబర్ 12న బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ 2.Oతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆయేషా జీనత్.

బ్యూటిఫుల్ ఆయేషా జీనత్ తెలుగు బుల్లితెరపై సీరియల్‌తో అట్రాక్ట్ చేసింది. అయితే, ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగులో మరో సీరియల్ బ్యూటి తనూజ గౌడ ఉంది. ఆమెతోపాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సైతం ఆటతో అలరిస్తున్నారు.

వీరందరితో పోటీ పడటానికి రీసెంట్‌గా రాయల్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా జీనత్ బిగ్ బాస్ హౌజ్‌లో రఫ్పాడిస్తుంది. తన అందచందాలతోనే కాకుండా అరుపులు, టాస్క్‌లతో జోరు చూపిస్తుంది.

ఆయెషా జీనత్ మొదటగా తమిళ సినీ ఇండస్ట్రీతో పరిచయం అయింది. తమిళంలో సీరియల్స్, టీవీ షోలు, సినిమాలతో పాపులర్ అయింది. అంతేకాకుండా బిగ్ బాస్ తమిళ సీజన్ 6లో కూడా పాల్గొని ఎంటర్‌టైన్ చేసింది.

2023లో ఊర్వశివో రాక్షసివో సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు హీరోయిన్‌గా పరిచయం అయింది ఆయేషా జీనత్. అయితే, ఆ సీరియల్ ఒక ఏడాదికే అంటే 2024లోనే ముగిసిపోయింది.

ఊర్వశివో రాక్షసివో సీరియల్‌ తర్వాత సావిత్రమ్మ గారి అబ్బాయి అనే మరో సీరియల్ చేసింది ఆయేషా జీనత్. వీటి తర్వాత తెలుగులోనే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ టీవీ షోలో పాల్గొంది. ఈ షోలో కూడా తన గ్లామర్‌, మాటలతో అందరి హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటిఫుల్ ఆయేషా.

ఇవే కాకుండా తమిళంలో రాంబో సినిమాలో కూడా నటించింది ఆయేషా జీనత్. తమిళంతోపాటు మలయాళ సినిమాలు కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మలయాళంలో డాక్టర్ బెన్నట్ చిత్రం చేస్తోంది ఆయేషా.

తమిళంలో స్టార్ హీరో విజయ్ ఆంటోనీతో లాయర్ అనే మూవీ కూడా చేస్తోంది బ్యూటిపుల్ ఆయేషా జీనత్. మరో కోలీవుడ్ సినిమా మోయి విరుందు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే, 2019లో జీ తెలుగు కుటుంబం విరుతుగల్ పురస్కారాల్లో ఉత్తమ నటిగా అవార్డ్ సైతం అందుకుంది ఆయేషా జీనత్. బెస్ట్ యాక్ట్రెస్‌తోపాటు బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అవార్డ్ కూడా అందుకుంది ముద్దుగుమ్మ ఆయేషా జీనత్.

ఇలా ఎంతో వెండితెర, బుల్లితెర బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆయేషా జీనత్ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌజ్‌లోకి రాగానే తన గ్లామర్‌తో తెలుగు యూత్ హృదయాలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఓవైపు అందంగా, క్యూట్‌గా కనిపిస్తూనే మరోవైపు టాస్క్‌లు బాగా ఆడుతూ అవసరం అయినప్పుడు, అవసరం లేకున్నా తోటి కంటెస్టెంట్స్‌పై అరుస్తూ బాగానే కంటెంట్ ఇస్తోంది ఈ బ్యూటిఫుల్ ఆయేషా జీనత్. మరి ఈ ముద్దుగుమ్మ ఎన్నిరోజులు బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లో అలరిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe