...
...
Next Story

Mavigun Viral Photos : ఇదిగో మావిగన్ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, ఓడరేవు.. ఫోటోలు వైరల్

Mavigun Viral Photos : ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాజధాని గురించి మాట్లాడుతూ.. మావిగన్ అయితే బాగుంటుందని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

Published on: Apr 5, 2026, 17:48:59 IST
Advertisement
<p>పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు వచ్చిన సమయంలో వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మావిగన్ అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై రచ్చ రచ్చ అవుతుంది.</p>

పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు వచ్చిన సమయంలో వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మావిగన్ అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై రచ్చ రచ్చ అవుతుంది.

MAVIGUN పేరుతో క్యాపిటల్ డిక్లేర్ చేస్తే బాగుండేదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. మచిలీపట్నం టూ విజయవాడ 70 కి.మీ, విజయవాడ టూ గుంటూరు 40 కి.మీ.. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్‌ కారిడార్‌ కింద డిక్లేర్‌ చేస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

'ప్లాన్‌-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు, పట్టించుకోలేదు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి. దీని కోసం అమరావతిలో పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ పెట్టినా చాలు.' అని వైఎస్ జగన్ అన్నారు.

దీనిపై వైసీపీ నేతలేమో మావిగన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం మావిగన్‌ పేరుపై వెటకారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు మావిగన్ ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్, ఓడరేవు అంటూ ఏఐతో ఫోటోలు క్రియేట్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe