
ఇండియన్ పాపులర్ సినీ ఫీమేల్ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ చూసేయండి. జూన్ నెలకు గాను ఓర్మాక్స్ రిలీజ్ చేసిన లిస్ట్ ఇక్కడుంది. ఇందులో టాప్-5 హీరోయిన్లు వీళ్లే. ఈ లిస్ట్ లో నయనతారకు చోటు దక్కలేదు.
మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమంత.. తిరిగి ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. రీసెంట్ గా ఈ భామ ఆల్ఫా మూవీలో నటించింది.
రెండో సారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె మూడో ర్యాంకు సాధించింది. ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు, రాకా షూటింగ్ అప్ డేట్స్ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టాయి.
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ లో కాక్ టైల్ 2 మూవీలో నటించింది ఈ నేషనల్ క్రష్.
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ టాప్-5లో చోటు దక్కించుకుంది. ఆమె అప్ కమింగ్ మూవీ ది ఇండియన్ స్టోరీ బజ్ కారణంగా కాజల్ కు క్రేజ్ దక్కుతోంది.