...
...
Next Story

Rain Alert : తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన.. వాతావరణ శాఖ అలర్ట్

Weather Update : తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.

Published on: May 03, 2026 03:57 PM IST
Advertisement

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం(మే 3), సోమవారం(మే 4) తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మే 5వ తేదీన కూడా కొన్ని జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

ఈ జిల్లాల్లో వానలు

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

ఈ క్రింది జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో వానలు ఎక్కువగా పడనున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉష్ణోగ్రతల్లో మార్పులు

వచ్చే రెండు రోజుల పాటు ఎండలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగినప్పటికీ, ఆ తదుపరి మూడు రోజుల్లో వాతావరణం చల్లబడనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వర్షం కురిసే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఉండకూడదని వాతావరణ శాఖ సూచిస్తోంది. బయటకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి.

వడగాలులు

గత 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో వడగాలులు తీవ్రమయ్యాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ స్థాయిల కంటే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని భారత వాతావరణ శాఖ డేటా ధృవీకరించింది. ఐఎండీ హైదరాబాద్ ప్రకారం, ఉత్తర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాని తర్వాత ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఇది సాధారణం కంటే సుమారు 2.5 డిగ్రీలు ఎక్కువ.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe