TGSRTC Employees DA hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి (2026) నుంచి 2.1 శాతం డీఏను పెంచనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఇంతకు ముందు 50.7 శాతం డీఏ ఉండగా… తాజా పెంపుతో ఇది 52.8 శాతం చేరుతుంది.

గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా డీఏను చెల్లించనుంది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. చివరగా జూలై 2025 లో 2.1 శాతం డీఏ పెంచారు. డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
జనవరి నుంచే అమలు - రవాణాశాఖ మంత్రి పొన్నం
ఆర్టీసీలో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసిందని ప్రకటించారు.
“జనవరి 2026 నుంచే 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వస్తుంది. దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుంది. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుంది” అని మంత్రి పొన్నం చెప్పారు.
పెండింగ్ లో ఉన్న డీఏ 2.1 శాతం పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7 శాతం నుండి 52.8 శాతానికి పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగికీ ఇది ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ లో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లెలా కృషి చేస్తామని ప్రకటించారు.
{{/usCountry}}పెండింగ్ లో ఉన్న డీఏ 2.1 శాతం పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7 శాతం నుండి 52.8 శాతానికి పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగికీ ఇది ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ లో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లెలా కృషి చేస్తామని ప్రకటించారు.
{{/usCountry}}ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏ ను ప్రకటించడం సంతోషకరమని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయని చెప్పారు.