హైదరాబాద్: భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థుల విదేశీ విద్యా కలలకు రెక్కలు తొడిగేలా హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ (MU) ఒక కీలక అడుగు వేసింది. ప్రఖ్యాతి గాంచిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ANU) తో చేతులు కలిపి ఒక వినూత్న విద్యా ఒప్పందాన్ని (Articulation Agreement) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సరికొత్త మార్గం సుగమమైంది.
ఏమిటీ 2+2 ప్రోగ్రామ్?

ఈ ఒప్పందం ప్రకారం, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ నాలుగేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లను హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో పూర్తి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రెండేళ్ల చదువును ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని ANU క్యాంపస్‌లో కొనసాగిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆస్ట్రేలియాలోనే అగ్రశ్రేణి వర్సిటీగా పేరున్న ANU నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందిన డిగ్రీ లభిస్తుంది.
డిమాండ్ ఉన్న ఏడు విభాగాల్లో అవకాశం:
ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు ఆసక్తి చూపే ఏడు కీలక ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ అవకాశం కల్పించారు. అవి:
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- మెకట్రానిక్స్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- నానో టెక్నాలజీ
"ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి ఉన్న అపారమైన పరిశోధనా నేపథ్యం, ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ఖ్యాతి.. మహీంద్రా యూనివర్సిటీ విద్యా దృక్పథానికి అద్దం పడతాయి. ఈ భాగస్వామ్యం మా విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ వేదికను అందించడమే కాకుండా, రెండు వర్సిటీల మధ్య విద్యా, పరిశోధనా బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది" అని మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాజులు మేడూరి పేర్కొన్నారు.
ఈ ఒప్పందంపై ANU స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అసోసియేట్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్) ప్రొఫెసర్ శివ కరుటూరి స్పందిస్తూ.. "మెరుగైన ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ 'సిస్టమ్స్ ఇంజనీరింగ్' విధానంలో చదువుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. మహీంద్రా వర్సిటీతో కలిసి విద్యా, పరిశోధనా రంగాల్లో సుదీర్ఘకాలం పనిచేయాలని ఆశిస్తున్నాం" అని వివరించారు.
ప్రవేశాలు, నాణ్యత:
{{/usCountry}}ఈ ఒప్పందంపై ANU స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అసోసియేట్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్) ప్రొఫెసర్ శివ కరుటూరి స్పందిస్తూ.. "మెరుగైన ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మల్టీ డిసిప్లినరీ 'సిస్టమ్స్ ఇంజనీరింగ్' విధానంలో చదువుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. మహీంద్రా వర్సిటీతో కలిసి విద్యా, పరిశోధనా రంగాల్లో సుదీర్ఘకాలం పనిచేయాలని ఆశిస్తున్నాం" అని వివరించారు.
ప్రవేశాలు, నాణ్యత:
{{/usCountry}}విద్యార్థుల విద్యా ప్రమాణాలను కాపాడేందుకు గానూ, ప్రస్తుతానికి ఏడాదికి కేవలం 20 మంది విద్యార్థులను మాత్రమే ఈ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేయనున్నారు. కేవలం విద్యార్థుల మార్పిడికే పరిమితం కాకుండా.. అధ్యాపకుల మధ్య అనుభవాల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు వంటి అంశాలకు కూడా ఈ ఒప్పందం పునాది వేస్తుందని మహీంద్రా యూనివర్సిటీ అసోసియేట్ డీన్ విశాలాక్షి తలకోకుల తెలిపారు.
నేపథ్యం:
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ స్థాపించిన మహీంద్రా యూనివర్సిటీ, పరిశోధన, వ్యవస్థాపకతకు పెద్దపీట వేస్తోంది. మరోవైపు, 1946లో స్థాపితమైన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ANU) అంతర్జాతీయంగా 32వ ర్యాంకులో (QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026) కొనసాగుతోంది. ఈ రెండు దిగ్గజ సంస్థల కలయిక తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గ్లోబల్ కెరీర్ దిశగా ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.