రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను సజావుగా ముగించారు. కొత్త సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావటంతో… వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది.
సోమవారం ప్రమాణస్వీకారాలు…

సోమవారం(డిసెంబర్ 22) నుంచి కొత్త సర్పంచ్ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులతో కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. దీంతో ప్రత్యేకాధికారుల పాలన ముగిసినట్లు అవుతుంది. వీరి ప్రమాణస్వీకారాలకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పంచాయతీ కార్యదర్శులు… ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఈ తేదీనే (డిసెంబర్ 22) కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం జరగనుంది. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం గెలిచినవాళ్లు బాధ్యతలను చేపడతారు. ఈ నెల 17 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరోవైపు కొత్త పాలకవర్గం రావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే వీటిలో ఫలితాలు తేలిపోయాయి. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. కోర్టు కేసుల నేపథ్యంలో రాష్ట్రంలోని 32 గ్రామపంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.
2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా.. అప్పట్నుంచే ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో… ప్రభుత్వ వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి మూడో విడతల్లో ఈ ఎన్నికలను పూర్తి చేసింది.
రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. వాటికి 2024 జనవరిలో పదవీకాలం పూర్తయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావటంతో ఎన్నికల నిర్వహణ కుదరలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… బీసీలకు రిజర్వేషన్లను 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కుల గణన కూడా నిర్వహించింది.
{{/usCountry}}రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. వాటికి 2024 జనవరిలో పదవీకాలం పూర్తయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావటంతో ఎన్నికల నిర్వహణ కుదరలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… బీసీలకు రిజర్వేషన్లను 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కుల గణన కూడా నిర్వహించింది.
{{/usCountry}}ఈ ఏడాది సెప్టెంబరు 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కానీ వేర్వరు పిటిషన్లు దాఖలు కావటంతో… అక్టోబరు 9న రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకుండా రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంతో పాటు హైకోర్టు స్పష్టం చేసిది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితి మేరకే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది.