...
...
Next Story

కామారెడ్డి జిల్లా : రూ.50 వేలు లంచం డిమాండ్ - ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల తహసీల్దార్‌ ఏసీబీ వలకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది.

Published on: Jan 07, 2026 06:02 AM IST
Advertisement

గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు అనే అధికారి పట్టుబడ్డాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా దొరికిపోగా కేసు నమోదైంది.

రూ. 50 వేలు లంచం డిమాండ్

ఏసీబీకి చిక్కిన యార్లగడ్డ శ్రీనివాసరావు
ఏసీబీకి చిక్కిన యార్లగడ్డ శ్రీనివాసరావు

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. నాగిరెడ్డిపల్లి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి(ఫిర్యాదుదారుడు) తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయభూమిని తనపైకి మార్చుకునేందుకు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సంబంధిత అధికారులకు నివేదిక పంపేందుకు ఫిర్యాదుదారుడిని తహసీల్దార్(ఎమ్మార్వో) యార్లగడ్డ శ్రీనివాసరావు రూ. 50 వేలు డిమాండ్ చేశాడు.

ఈ లంచాన్ని ప్రైవేట్ వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. సదరు ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా… లంచం తీసుకుంటా తహసీల్దార్ తో పాటు అజయ్ పట్టుబడ్డారు. ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ఇక ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe