...
...
Next Story

గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 : చివరి రోజు భారీగా నామినేషన్లు - నేటి నుంచి రెండో విడత ప్రక్రియ

గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురు, శుక్రవారాల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా… శనివారం మాత్రం భారీగానే నామినేషన్లు వేశారు.డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

Published on: Nov 30, 2025 07:40 AM IST
Advertisement

గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు.గురువారం, శుక్రవారాల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా… చివరిరోజు అయిన శనివారం మాత్రం భారీగానే నామినేషన్లు వేశారు. పలుచోట్ల అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది.

గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025

సర్పంచ్‌ పదవులకు తొలి రెండు రోజుల్లో 8,198 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. తొలిరోజు 3,297 నామినేషన్లు రాగా, రెండో రోజు శుక్రవారం 4,901 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు సర్పంచ్ స్థానాల కోసం 20 వేలకు పైగా…. వార్డు సభ్యులకు 50వేలకు పైగా దాఖలయ్యాయి. ఎన్నికల సంఘం అధికారికంగా వివరాలను ప్రకటించాల్సి ఉంది.

ఇవాళ పరిశీలన… డిసెంబర్ 3న ఫైనల్ లిస్ట్

ఇవాళ మొదటి విడత నామినేషన్లను పరిశీలిస్తారు. చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్ల స్వీకరణ, డిసెంబర్ 2వ తేదీన అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు.

డిసెంబర్ 11న పోలింగ్…

మొదటి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు డిసెంబర్‌ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉప సర్పంచి ఎన్నికను కూడా పూర్తి చేస్తారు.

మరోవైపు ఆదివారం నుంచే రెండో విడత నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతుంది. డిసెంబరు 2 వరకు వీటిని స్వీకరిస్తారు. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ ఉండగా… అధే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఇక చివరి విడత పోలింగ్ డిసెంబర్ 17వ తేదీ నిర్వహిస్తారు.

కొనసాగుతున్న ఏకగ్రీవాలు…

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనా కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అదే గ్రామానికి చెందిన మల్లేపాకుల వెంకటయ్య(అలియాస్‌ మోహన్‌) ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన మావోయిస్టు పార్టీలో పని చేయగా… 2001లో లొంగిపోయారు. చాలారోజుల పాటు హోంగార్డుగా విధులు నిర్వర్తించగా… తాజాగా సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. ఇయన సీఎం రేవంత్ రెడ్డికి చిన్ననాటి మిత్రుడు. వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి.

ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది.నవంబర్ 19 నుంచి డిసెంబరు 9 వరకు గ్రామాల్లో చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe